Catch Match highlights of India vs New Zealand 1st T20. India's first ever win vs NZ in T20I. India was put to bat by Kane Williamson, but that did not stop the hosts from scoring as they posted a mammoth total of 202-3 from 20 overs, thanks to knocks by Rohit Sharma and Shikhar Dhawan.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో కివీస్‌పై వెక్కిరిస్తున్న చెత్త రికార్డుని భారత్ బుధవారం బద్దలుకొట్టింది. అంతేకాదు ఈ విజయంతో టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రాకు కోహ్లీసేన ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 202 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.